బాలయ్యతో త్రివిక్రమ్‌…!

297
Trivikram Srinivas
- Advertisement -

ప్రస్తుతం బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న బాలయ్య. ఈ సినిమాకు అఖండ అనే టైటిల్‌ ఖరారు చేయగా బాలయ్య- బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న ఈ హ్యాట్రిక్‌ కాంబోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా బాలకృష్ణ నెక్ట్స్‌ ప్రాజెక్టుపై టీ టౌన్‌లో ఆసక్తిర వార్త చక్కర్లు కొడుతోంది.

అఖండ తర్వాత గోపీచంద్ మలినేనితో తర్వాత హాసిని అండ్ హారిక బ్యానర్ లో ఓ చిత్రం చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇక ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తారని వార్తలు వస్తుండగా ఈ విషయంపై ఇప్పటి వరకూ అటు బాలయ్య గానీ, ఇటు త్రివిక్రమ్ గానీ స్పందించలేదు. త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ బాబుతో చేయనున్న సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు. ఒకవేళ బాలయ్య- త్రివిక్రమ్ కాంబో వస్తే ఫ్యాన్స్‌కు పండగే.

- Advertisement -