చైనాను ముంచెత్తిన వర్షాలు..

68
china

చైనాను భారీ వర్షాలు ముంచెత్తాయి. భారీ వర్షాలతో నదులు పొంగిపొర్లుతుండగా జనజీవనం అస్తవ్యస్తమైంది. హెన‌న్ ప్రావిన్స్ లో గ‌తంలో ఎప్పుడూ లేనంత‌గా వ‌ర్షాలు కురిశాయి. గ‌త వెయ్యి సంవ‌త్సరాల కాలంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ స్థాయిలో వ‌ర్షం కుర‌వ‌లేద‌ని అక్క‌డి వాతావ‌ర‌ణ శాఖ తెలియ‌జేసింది.

వ‌ర‌ద‌ల్లో వంద‌లాది కార్లు కొట్టుకుపోయాయి. లోక‌ల్ రైళ్లోకి నీరు చేరడంతో ప్ర‌యాణికులు ఇబ్బందులు ప‌డ్డారు. ఎటు చూసినా వ‌ర‌ద నీరే క‌నిపించ‌డంతో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు. మ‌రో కొన్నిరోజులపాటు వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ స్పష్టం చేసింది.