అయిననూ పోయిరావలె..కథపై క్లారిటీ ఇచ్చేశాడు..!

487
trivikram srinivas
- Advertisement -

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. అరవింద సమేత తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడంలో భారీ అంచనాలు నెలకొన్నాయి.త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుండగా మూవీకి సంబంధించి రోజుకోవార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమా కథ మెగాస్టార్ చిరంజీవి మూవీ మంత్రిగారి వియ్యంకుడు సినిమాకు కాపీ అని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలను కొట్టిపారేశారు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. తాను సొంతంగా రాసుకున్న కథతోనే తారక్‌తో సినిమా తీస్తున్నానని అన్నారు.

ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ఇది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై ఎస్.రాధాకృష్ణ (చినబాబు), నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ వేసవి నుంచి సెట్స్‌పైకి వెళుతుంది. సినిమాకు ‘అయిననూ పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్‌ని ఖరారు చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి.

- Advertisement -