మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘అరవింద సమేత’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్గా పూజా హెగ్డే నటిస్తుండగా ఇక ఇటీవలె ఓ ప్రత్యేక పాత్ర కోసం తెలుగు అమ్మాయి ఈషా రెబ్బని ఎంపిక చేసుకున్నారు చిత్ర యూనిట్.
ఇక విషయానికొస్తే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం మరో నాయికను ఎంపిక చేసుకున్నారట చిత్ర బృందం. గతంలో ఎన్టీఆర్‌తో ఆడిపాడిన కాజల్ అగర్వాల్ తారక్‌తో మరోసారి గంతులేయనుంది. చిత్తూరు యాసలో రచయిత పెంచల దాస్ రాసిన ఓ స్సెషల్ సాంగ్‌లో కాజల్ చిందులేయనుంది. గతంలో ఎన్టీఆర్ నటించిన ‘జనతాగ్యారేజ్’ చిత్రంలో ‘నేను పక్కాలోకల్’ అంటూ ప్రత్యేక సాంగ్‌లో మెరిసింది కాజల్.
ఇక ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో గ్యాప్ లేకుండా జరుపుకుంటోంది. రాయలసీమ నేపధ్యంలో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో త్రివిక్రమ్ మూవీ ‘అజ్ఞాతవాసి’ గోరంగా విఫలమవడంతో ఈ సినిమాతో సమాధానం చెప్పనున్నాడట.