విన్నర్….న్యూ ఇయర్ విషెస్

105
Sai Dharam Tej's Winner Wishes Happy New year

మెగా వారసుల్లో మినిమమ్ గ్యారెంటీ స్టార్గా పేరు తెచ్చుకున్న హీరో సాయిధరమ్ తేజ్‌. హ్యాట్రిక్ హిట్స్తో తన సత్తాచాటిన ఈ సుప్రీమ్‌ హీరో…ఇప్పుడు తన మార్కెట్ రేంజ్ను మరింత పెంచుకునే పనిలో పడ్డాడు. గత సినిమాలతో 20 కోట్ల వరకు షేర్ సాధించిన ఈ యంగ్ హీరో నెక్ట్స్ సినిమాతో మరో అడుగు ముందుకేయాలని ప్లాన్ చేస్తున్నాడు. అందుకు తగ్గట్టుగా సినిమా బడ్జెట్ కూడా భారీగా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు.

WINNER Happy New year  wall papers

సాయిధరమ్ తేజ్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ‘ఠాగూర్’ మధు నిర్మిస్తున్న చిత్రం ‘విన్నర్’ తెరకెక్కనుంది. ప్రస్తుతం మహేష్ బాబు, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల సరసన బిజీగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్, ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే దాదాపుగా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 24న చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

WINNER Happy New year  wall papers

ఇటీవల సాయిధరమ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా విన్నర్ ఫస్ట్ లుక్‌ని విడుదల చేయగా ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ‘‘కన్నతండ్రితో పాటు ప్రేమించిన అమ్మాయి మనసు గెలవడం కోసం ఓ యువకుడు చేసిన పోరాటంగా తెరకెక్కిన ఈ చిత్రంతో తేజ్‌…క్వాడ్రపుల్ హిట్ కొట్టేందుకు రెఢీ అవుతున్నాడు. తాజాగా నూతన సంవత్సరం కానుకగా విన్నర్‌ పోస్టర్‌ని విడుదల చేశారు.

Sai Dharam Tej's Winner Wishes Happy New year