రెమ్యునరేషన్ పెంచేసిన ముదురు భామ

40
- Advertisement -

సౌత్‌లో రెండు దశాబ్దాలుగా టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్న త్రిషకు వరుస పాన్ ఇండియా ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ భామ చేతిలో కమల్, మణిరత్నం సినిమాతో పాటు అజిత్ సినిమా కూడా ఉంది. అయితే తనకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని త్రిష, రెమ్యునరేషన్‌ను రూ. 2 కోట్ల నుంచి ఏకంగా రూ. 3 కోట్లకు పెంచేసిందని టాక్. దీనిలో నిజమెంతుందో తెలియాల్సి ఉంది. ఒక్కటి మాత్రం స్పష్టం. సౌత్‌లో ఏ స్టార్ హీరోయిన్ కి రానన్ని ఛాన్స్ లు ఇప్పుడు త్రిష సొంతం.

ఇటు తెలుగులో కూడా త్రిషకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం ఈ భామ చేతిలో బాలయ్య – మెగాస్టార్ చిరంజీవి సినిమాలతో పాటు రవితేజ హీరోగా నటిస్తున్న మరో చిత్రం కూడా ఉంది. మొత్తానికి త్రిషకి లేటు వయసులో కూడా ఫుల్ డిమాండ్ పెరిగింది. అందుకు అనుగుణంగానే త్రిష కూడా లేటు వయసులో ఘాటు అందాలు ఆరబోయడానికి ఏ మాత్రం మొహమాట పడట్లేదు. అజిత్ తో చేయబోయే సినిమా కోసం ఈ ముదురు భామ బికినీ కూడా వేయబోతుంది.

అన్నట్టు త్రిష పెళ్లి గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. త్రిష ఓ నిర్మాతతో చాలా సన్నిహితంగా ఉంటుందని.. అయితే ఇప్పటికే ఆ నిర్మాతకు ఆల్ రెడీ పెళ్లి అయ్యింది అని.. పైగా భార్యా పిల్లలు కూడా ఉన్నారు అని, మరి అలాంటి వ్యక్తితో త్రిష ఎందుకు ప్రేమలో పడింది అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా త్రిష ఏం చేసినా ప్రస్తుతం అది హాట్ టాపిక్ అవుతుంది.

Also Read:MLC Kavitha:జై తెలంగాణ ఎందుకు అనరు?

- Advertisement -