CM KCR:హుజురాబాద్ బీఆర్ఎస్‌దే

80
- Advertisement -

బీజేపీతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదన్నారు సీఎం కేసీఆర్.హుజురాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డికి మద్దతుగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన సీఎం..తెలంగాణకు ఏం చేయని బీజేపీకి ఒక్క ఓటు ఎందుకు వేయాలన్నారు. రైతు బంధు ఉండాలంటే కౌశిక్ రెడ్డి గెలవాలన్నారు.

తెలంగాణ నుండి నలుగురు బీజేపీ ఎంపీలు ఉన్నారు…వారు రాష్ట్రానికి చేసింది శూన్యం అన్నారు. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టనందుకు రూ.25 వేల కోట్లు కోత పెట్టారని మండిపడ్డారు సీఎం కేసీఆర్. చట్టాన్ని ఉల్లంఘించి మరి ఒక నవోదయ పాఠశాలను బీజేపీ ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ వస్తూ ధరణి రద్దు చేస్తామని మాట్లాడుతున్నారని ధరణి రద్దైతే మళ్లీ దళారుల రాజ్యమే వస్తుందన్నారు.

రైతులు పండించిన పంటను ప్రభుత్వమే కొంటుందన్నారు. రైతుల కోసం మంచి చేస్తున్న పార్టీ బీఆర్ఎస్ అన్నారు.హుజురాబాద్ నియోజకవర్గంలోని మేధావులు అంతా ఆలోచించి ఓటు వేయాలన్నారు.బీజేపీ అభ్యర్థి గెలిస్తే ఏం జరగదన్నారు. బీజేపీ అభ్యర్థివి ఉట్టి మాటలన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి గెలిస్తే మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. బీజేపీకి ఓటేస్తే మోరిలో వేసినట్లే అన్నారు. హుజురాబాద్‌ను డెవలప్‌మ చేసిందే కేసీఆర్ అన్నారు. కౌశిక్ రెడ్డికి ఒక్క అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కౌశిక్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత తనదన్నారు.

గతంలో ఒకసారి తనను బాధపెట్టారన్నారు. మళ్లీ అలా జరగడానికి వీలు లేదన్నారు. పాలిచ్చే బర్రెను వదిలిపెట్టి దున్నపోతును తెచ్చుకుంటారా ఆలోచించాలన్నారు. సర్వేల్లో కౌశిక్ రెడ్డి గెలుపు ఖాయమని తేలిపోయిందన్నారు.

Also Read:CM KCR:ధరణిని తీసేస్తే మళ్లీ దళారుల రాజ్యం

- Advertisement -