బాలీవుడ్లో సంచలనం సృష్టించిన ‘ది డర్టీ పిక్చర్’ సినిమాకు సీక్వెల్ రాబోతోంది. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఈ చిత్రానికి రెండో భాగాన్ని రూపొందించేందుకు నిర్మాత ఏక్తా కపూర్ సిద్ధమయ్యారు. తాజాగా ఆమె ఈ ప్రాజెక్ట్ను ధ్రువీకరించడంతో సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. మరోవైపు, ఈ సినిమాలో ప్రధాన పాత్ర కోసం తమన్నా భాటియా పేరు ప్రముఖంగా వినిపిస్తుండటంతో టాలీవుడ్, బాలీవుడ్ వర్గాల్లో చర్చ మొదలైంది.
2011లో విడుదలైన ‘ది డర్టీ పిక్చర్’లో విద్యాబాలన్ ప్రధాన పాత్ర పోషించారు. దక్షిణాది నటి సిల్క్ స్మిత జీవితంలోని కొన్ని అంశాల స్ఫూర్తితో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు విద్యాబాలన్ నటనకు విశేష గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో ఆమె ప్రదర్శనకు జాతీయ చలనచిత్ర అవార్డు కూడా లభించింది.
ఇప్పుడు సీక్వెల్లో తమన్నా నటించనున్నారనే ప్రచారం సాగుతోంది. మరో నటి తృప్తి దిమ్రి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, వీరిలో ఎవరు ప్రధాన పాత్ర పోషించనున్నారనే విషయంపై చిత్ర బృందం అధికారికంగా ప్రకటించలేదు.
Also Read:SIRపై సుప్రీంకు ఒవైసీ
‘లస్ట్ స్టోరీస్ 2’, ‘జైలర్’ వంటి ప్రాజెక్టులతో ప్రేక్షకుల్లో గుర్తింపు పొందిన తమన్నా.. ఈ సినిమాలో అవకాశం దక్కించుకుంటే మరో వైవిధ్యమైన పాత్రలో కనిపించే అవకాశం ఉంటుంది.

