SIRపై సుప్రీంకు ఒవైసీ

0
- Advertisement -

ఎన్నికల సంఘం (ఈసీఐ) చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను సవాల్ చేస్తూ ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై ప్రతిపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఒవైసీ పిటిషన్ ప్రాధాన్యం సంతరించుకుంది. ఎస్‌ఐఆర్‌ అమలు, ఓటర్ల పేర్ల తొలగింపు, అర్హులైన ఓటర్లకు కల్పించాల్సిన రక్షణ చర్యలపై ఇప్పటికే ప్రతిపక్ష నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించే విషయంలో పారదర్శకత ఉండాలని, అర్హులైన ఓటర్లకు తమ వాదనలు వినిపించుకునే అవకాశం కల్పించాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒవైసీ సుప్రీంకోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది.

Also Read:ది ట్రైటర్స్ తెలుగు..క్లోక్‌మెన్ సందడి

- Advertisement -