శనివారం త్రిపుర సీఎం పదవికి బిప్లవ్ కుమార్ దేవ్ రాజీనామా చేశారు. ఢిల్లీ పర్యటన అనంతరం రాష్ట్రానికి వచ్చిన ఆయన ఈరోజు సీఎం పదవికి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా బిప్లవ్ బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. శనివారం తిరిగి రాష్ట్రానికి చేరుకున్నారు.
బీజేపీ అధిష్ఠానం ఆదేశాల మేరకే బిప్లవ్ తన పదవికి రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. 2018లో త్రిపుర సీఎంగా ఆయన పదవీ బాధ్యతలు చేపట్టగా… గడచిన నాలుగేళ్ల పాటు ఆయన ప్రభుత్వాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండానే నడిపించారు. అయితే కారణాలేమిటో తెలియదు గానీ… ఉన్నట్టుండి ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు, ఈ నేపథ్యంలో బిప్లవ్ స్థానంలో త్రిపుర సీఎం పదవికి మరో కొత్త నేతను బీజేపీ అధిష్ఠానం ఎంపిక చేయనుంది. అయితే బిప్లవ్ కుమార్ ఎందుకు రాజీనామా చేశారన్న విషయం తెలియాల్సి వుంది.