న్యూడ్ సీన్లపై హీరోయిన్ స్పందన

60
- Advertisement -

‘త్రిప్తి డిమ్రీ’ నటించిన యానిమల్ చిత్రంలో ఆమె న్యూడ్ సీన్సే మెయిన్ హైలైట్ గా నిలిచాయి. ఈ సినిమాలో ఆమె రణ్ బీర్ కపూర్ సరసన చాలా బోల్డ్ గా నటించి మెప్పించింది. నిజానికి, రణ్ బీర్ తో ఆమె నటించడం ఇదే మొదటిసారి. అయినా, బోల్డ్ సీన్స్ లో రణ్ బీర్ పై పోటీ పడి మరీ నటించింది. ఈ క్రమంలో ఆమె అందాలు బాగా హైలైట్ అయ్యాయి. ఆమె గతంలో చేసిన ఓ సినిమాలో కూడా త్రిప్తి డిమ్రీ ఒక పాటలో మొత్తం బికినీలోనే ఉంటుంది. ఆ సినిమాలోని బికినీ విజువల్స్ ను తాజాగా నెటిజన్లు వైరల్ చేస్తూ.. త్రిప్తి డిమ్రీకి అందాల ఆరబోత కొత్తేమీ కాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మొత్తానికి త్రిప్తి డిమ్రీ బోల్డ్ అందాల షో గురించి చాలా కాంట్రవర్సీ నడుస్తోంది. ఇలా న్యూడ్ సీన్స్ లో నటిస్తావా ? అంటూ త్రిప్తి డిమ్రీ పై హిందూ సంఘాలు గొడవకు కూడా దిగుతున్నాయి. దీంతో, ఎందుకు వివాదం చేస్తున్నారు ? అంటూ త్రిప్తి డిమ్రీ కి కోపమొచ్చింది. యానిమల్ సినిమా ఫ్యామిలీ ఎమోషన్స్ చాటేలా ఉంది కదా. అయినా రెండు సీన్ల నా న్యూడ్ బిట్స్ పైనే మీ చూపు పడిందా అంటూ త్రిప్తి డిమ్రీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఒక నటిగా ఏ పాత్ర అయినా చేయడం నా దర్మం. అలాగే, ఆ పాత్ర కోసం ఎలాంటి దుస్తులు ధరించడానికైనా నేను సిద్ధం’ అంటూ త్రిప్తి డిమ్రీ చెప్పింది.

త్రిప్తి డిమ్రీ ఇంకా మాట్లాడుతూ.. ‘హీరోయిన్ల బోల్డ సీన్లని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ రకరకాల కామెంట్స్ చేస్తూ వారిని బాధ పెడుతున్నారు. హీరోయిన్లను మానసికంగా వేధించే సంస్కృతి పోవాలంటే మీడియా కూడా ఇలాంటి సన్నివేశాలకు ఎక్కువ ప్రచారం ఇవ్వొద్దు అని త్రిప్తి డిమ్రీ కోరుతుంది. రొమాన్స్, సాంగ్స్ లో అలాంటివి తప్పవు. కాబట్టి వాటిని కాకుండా హీరోయిన్ల నటన గురించి మంచి మాటలు రాస్తే మంచిది అంటూ త్రిప్తి డిమ్రీ మొత్తానికి సలహాలు కూడా ఇస్తోంది. ఏది ఏమైనా ఒక బెడ్ సీన్ తో త్రిప్తి డిమ్రీ ఇండియా వైడ్ గా వైరల్ అయిపోయింది.

Also Read:ఓటీటీ:ఈ వారం చిత్రాల పరిస్థితేంటి?

- Advertisement -