SocialMedia:ట్రెండ్ అవుతున్న బీజేపీ బ్రోకర్‌ లీకర్‌..!

43
- Advertisement -

బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉద్యోగాల కుంభకోణాలు, స్కామ్‌లు, లీక్‌లు జరగడం ఒక అనావాయితీగా మారిపోయింది. ముఖ్యంగా ఉద్యోగం కోసం ప్రయత్నించే నిరుద్యోగుల ప్రశ్నాపత్రాలు కూడా లీకేజీలు ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో గడిచిన 8యేళ్ల కాలంలో ఎన్నో సార్లు జరిగింది. తాజాగా తెలంగాణ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్‌ పదవ తరగతి పరీక్షను లీక్‌ చేసిన వ్యవహారంలో 14రోజులు రిమాండ్‌ విధించిన సంగతి తెలిసిందే.

గతంలో టీఎస్‌పీఎస్సీ లీక్‌కు బండి సంజయ్‌కు సంబంధం ఉన్నట్టుగా భావించి సిట్‌ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా పదవ తరగతి లీక్‌ సంఘటనతో దేశ్యవ్యాప్తంగా మరోసారి బీజేపీ లీకుల పర్వం మళ్లీ తెరమీదికి వచ్చింది. దీంతో సోషల్‌ మీడియాలో హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతుంది. #BJPBrokerAndLeaker పేరుతో సోషల్‌మీడియాలో విపరీతంగా ట్రెండ్‌ అవుతుంది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీఎల్‌ సంతోష్‌, పదవ తరగతి పరీక్షల్లో బండి సంజయ్‌ లీకుల వ్యవహారంతో దేశవ్యాప్తంగా మరియు తెలంగాణలో కూడా పరువు పొగొట్టుకుంటున్నారు.

అయితే తాజాగా గుజరాత్‌లో జనవరిలో జరిగిన జూనియర్ కర్ల్క్‌ పరీక్ష కుంభకోణంలో సూమారుగా 30మందిని పట్టుకొని విచారిస్తున్నట్టగా జాతీయ మీడియా కథనాలు వెలువడుతున్నాయి. ఇందులో పేపర్‌ లీక్‌లో పాల్గొన్న వారి నుంచి రూ. 12 నుంచి 15లక్షల వరకు చెల్లించేందుకు అంగీకారం కుదిరినట్టు గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారి తెలిపారు. జనవరిలో లీక్ అయిన పేపర్‌ను ఏప్రిల్‌లో పట్టుకొని విచారణ చేపట్టడం అనేక సందేహాలును కలిగిస్తుందని పలు విపక్ష పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. మరీ లీకుల పర్వం ముగించాలంటే బీజేపీకి స్వస్తి పలకాల్సిన సమయం అసన్నమైందని పలు ప్రాంతీయ పార్టీలు ముక్తకంఠంతో ఏకతాటిపైకి వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి…

KCR:కే‌సీ‌ఆర్ తో మాములుగుండదు మరి !

Komatireddy: పార్టీ మార్పుపై క్లారిటీ

Kanti Velugu:గొప్ప కార్యక్రమం

- Advertisement -