ఢిల్లీ కాలుష్యానికి రీ ప్లాంటేషన్ ఒక్కటే పరిష్కారం: ఎంపీ సంతోష్

88
gic
- Advertisement -

ఢిల్లీ కాలుష్యానికి రీ ప్లాంటేషన్ ఒక్కటే పరిష్కారం అన్నారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్. భవిష్యత్తులో ఢిల్లీ కాలుష్యాన్ని తగ్గించేందుకు న్యూఢిల్లీలో లక్ష మొక్కల పెంపకాన్ని చేపట్టారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో చేపట్టగా ఈ నవనిర్మాణ దీక్షలో వివిధ పార్టీలు, రాష్ట్రాలకు చెందిన ఎంపీలు పాల్గొన్నారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పార్క్ యొక్క ఖాళీ స్థలంలో ప్లాంటేషన్ చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ…నాలుగు సంవత్సరాల క్రితం ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రోగ్రాం సత్ఫలితాలను ఇస్తోందన్నారు. ఈ ఛాలెంజ్‌ని స్వీకరించేందుకు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని అన్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మరియు దేశవ్యాప్తంగా విస్తరించాలనే లక్ష్యంతో ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ…ఎంపీ సంతోష్ అద్భుత కార్యక్రమాన్ని చేపట్టారని ఇందుకు ఆయన్ని అభినందించాలన్నారు. ఢిల్లీ వంటి ప్రాంతంలో ఈ రకమైన చొరవ చాలా అవసరమని…ఇది మంచి కార్యక్రమం అన్నారు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్.

పర్యావరణ పరంగా ఎదురవుతున్న సవాళ్లను కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా పచ్చదనం పెంపు తక్షణావసరం అని ఆ దిశగా కృషి చేస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కి అభినందనలు అని శివ సేన ఎంపీ అనిల్ దేశాయ్ అన్నారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో తనవంతుగా భాగస్వామ్యం తీసుకునేందుకు రాంకీ సంస్థ ముందుకు వచ్చింది. ఢిల్లీలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా తమ సంస్థ సామాజిక బాధ్యతలో భాగంగా ఒక పార్కు ను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామని కార్యక్రమంలో పాల్గొన్న రామ్ కీ సంస్ధ చైర్మన్, ఎంపీ అయోధ్య రామిరెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపీలు శ్రీజైరాం రమేష్, సంజయ్ సింగ్ (ఆప్ ఎంపీ) బినోయ్ విశ్వం (సీపీఐ),అనిల్ దేశాయ్, రాజ్యసభ సభ్యుడు (శివసేన) సర్, మోపిదేవి వెంకటరమణ, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, గోరెంట్ల మాధవ్, వంగా గీత, మిథున్ రెడ్డి, కృష్ణ దేవరాయలు, వైఎస్ అవినాష్ రెడ్డి, గోరెంట్ల మాధవ్,
కె కేశవ రావు, నామా నాగేశ్వరరావు, జి రంజిత్ రెడ్డి, ఎం శ్రీనివాస్ రెడ్డి, మాలోత్ కవిత, శ్రీ వెంకటేష్ నేత, బి లింగయ్య యాదవ్, కెఆర్ సురేష్ రెడ్డి, పి దయాకర్, పి రాములు తదితర ఎంపీలు పాల్గొన్నారు. సింగరేణి సంస్థల డైరెక్టర్ ఎన్. బలరామ్ కూడా పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమాన్ని శశాంక్ ఆలా, ఐఏఎస్, డిప్యూటీ కమిషనర్, నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సమన్వయం చేశారు.

- Advertisement -