కేటీఆర్‌కి విషెస్ తెలిపిన రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్ పాపారావు..

209
muncipal
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ఆశాకిరణం,ఎదురులేని మనిషి కేసీఆర్ గారి తిరుగులేని తనయుడు, మున్సిపల్ శాఖ మాత్యులు, శ్రీ కల్వకుంట్ల తారక రామారావుని వారి పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మరియు రవాణా శాఖ ఉప రవాణా కమిషనర్ కె. పాపారావు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా వారు రాష్ట్రానికి చేస్తున్న సేవలను కొనియాడారు. శ్రీ కె పాపారావు గారు మాట్లాడుతూ కేటిఆర్ గారు అవిశ్రాంతంగా అన్ని రంగాలలో తెలంగాణ రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్న తీరు అద్భుతం. కరోనా క్లిష్ట సమయం లో కూడా రాష్ట్రం లోని అన్ని ప్రాంతాలలో వడి వడిగా సుడిగాలి పర్యటనలు చేస్తూ,అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం విశేషమని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. దేశంలోనే మన రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతున్నందుకు కేటిఆర్ గారి కి ధన్యవాదాలు తెలియజేసారు. హైదరాబాద్ ను విశ్వ నగరం గా రూపుదిద్దడానికి అన్ని తానై విరామం లేకుండా అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలియజేశారు.

- Advertisement -