చైనా హ్యాకర్ల విషయంలో అప్రమత్తంగా ఉన్నాం:ట్రాన్స్‌కో సీఎండీ

63
ts transco

తెలంగాణ హ్యాకర్ల విషయంలో అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు టీఎస్‌ జెన్కో,టాన్క్స్‌కో సీఎండీ. తెలంగాణ విద్యుత్ శాఖను కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ హెచ్చరించిన నేపథ్యంలో స్పందించిన సీఎండీ…చైనాకు సంబంధించిన కొంత మంది హ్యాకర్ లు తెలంగాణ స్టేట్ లోడ్ డిస్పీచ్ సెంటర్,తెలంగాణ ట్రాన్స్ కో సర్వర్ లను చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు.

అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకొని బ్లాకింగ్ సర్వర్స్, కంట్రోల్ పంక్షన్స్ ని గమనిస్తూ ఉండాలని సూచించింది సిఈఆర్టీ. విద్యుత్ శాఖ వెబ్ సైట్ లో కొనసాగుతున్న అందరి యూసర్ ఐడి ,పాస్ వర్డ్ లను మార్చేసింది విద్యుత్ శాఖ.