బీజేపీ పప్పులు ఉడకవు: ఓవైసీ

34
owaisi

ఓల్డ్ సిటీలో బీజేపీ పప్పులు ఉడకవన్నారు మజ్లిస్ అధినేత,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. హైదరాబాద్‌లో పార్టీ మీటింగ్‌లో మాట్లాడిన ఓవైసీ..బల్దియా ఎన్నికల్లో ఎంఐఎంను ఓడించటానికి ఓల్డ్ సిటీలో యూపీ సీఎం, బీజేపీ టీమ్ అంతా దిగిందని ఎద్దేవా చేశారు.

అహ్మదాబాద్, ఉత్తర ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కనీస సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు. ఆ ఎన్నికల్లో తమ పార్టీ గెలిస్తే ఓల్డ్ సిటీ పై సర్జికల్ స్ట్రైక్ చేస్తామన్నారని, ముందు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సర్జికల్ స్ట్రైక్ చేయాలని వ్యాఖ్యానించారు.