మార్చి 6న కుండ్లి-మనేసర్-పల్వాల్ ఎక్స్ ప్రెస్ వే దిగ్బందం..

45
farmers protest

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఆందోళన మార్చి 6తో 100వ రోజుకు చేరుకోనుంది. 6న కుండ్లి-మనేసర్-పల్వాల్ ఎక్స్ ప్రెస్ వేని దిగ్బందించాలని సంయుక్త కిసాన్ మోర్చా నిర్ణయించింది.

మార్చి 15 వరకు ఆందోళన కార్యాచరణ ప్రణాళిక ఖరారు చేసింది. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు బృందాలను పంపి బిజెపి అభ్యర్థులను ఒడించేందుకు కృషి చేస్తాం అని రైతు సంఘాల నేతలు తెలిపారు. మార్చి 6న ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దిగ్బందనం జరగనుంది.

రైతుల ఆందోళనకు 100 రోజుల సందర్భంగా ప్రజలు ఇంటివద్ద నలజెండాలు ఎగురవేయాలని పిలుపునిచ్చాయి రైతు సంఘాల నేతలు. మార్చి 5 నుంచి కర్ణాటకలో ఎంఎస్‌పీ దిలావ్ పేరుతో ఉద్యమం చేపట్టాలని మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దీక్షా స్థలాల్లో మహిళలను ముందుంచుతాం అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటికరణకు వ్యతిరేకంగా 10వ తేదీన పెద్ద ట్రేడ్ యూనియన్లతో ఆందోళన నిర్వహిస్తామని…మార్చి 15న కార్మికులు, ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తాం అని తెలిపాయి రైతు సంఘాలు.