దేశీయంగా ఒక టెలికాం నెట్వర్క్ నుంచి మరో నెట్‌వర్క్‌కు కాల్ వెళ్లినపుడు, కాల్ అందుకున్న నెట్‌వర్క్‌కు అనుసంధాన ఛార్జీ (ఐయూసీ) కింద మొదటి నెట్వర్క్ నిమిషానికి 14 పైసల చొప్పున చెల్లిస్తోంది. తాజాగా మొబైల్ ఫోన్ వినియోగదారులకు ట్రాయ్ (భారత టెలికం రంగ నియంత్రణ సంస్థ) శుభవార్త చెప్పింది. ఇంటర్ కనెక్షన్ ఛార్జీ (ఐయూసీ) లను నిమిషానికి 14 పైసల నుంచి 6 పైసలకు తగ్గిస్తున్నట్లు చెప్పింది. తగ్గించిన ఈ ఛార్జీలు వచ్చేనెల 1 నుంచే అమలులోకి వస్తాయని పేర్కొంది. అంతేగాక, జనవరి 1, 2020 నుంచి ఈ ఛార్జీలను పూర్తిగా ఎత్తివేస్తామని తెలిపింది.
మరోవైపు డేటాకు మాత్రమే ఛార్జీ చేస్తూ, కాల్స్‌కు ప్రత్యేకంగా రుసుము వసూలు చేయని రిలయన్స్ జియో మాత్రం అనుసంధాన ఛార్జీలు రద్దు చేయాలని కోరుతోంది. కాల్ అందుకున్న నెట్‌వర్క్‌కు ఛార్జీ చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంటోంది.