- Advertisement -
కేబుల్, డీటీహెచ్ నెలకు రూ.153.40 (జీఎస్టీతో కలిపి) చెల్లించి వంద పేడ్, ఉచిత చానళ్లు చూడొచ్చని ట్రాయ్ తెలిపింది. ఈ కొత్త విధానం ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభమవుతుంది. అయితే జనవరి 31 కంటే ముందే చానళ్లు ఎంచుకోవాల్సి ఉంటుందని ట్రాయ్ ఒక ప్రకటనలో పేర్కొన్నది. జనవరి 31లోపు వీక్షకులు 100 ఛానళ్లను ఎంపిక చేసుకోవాలని తెలిపింది. ఈ ప్యాక్‌లో హెచ్‌డీ ఛానళ్లు లభించవని స్పష్టం చేసింది.
అయితే, రెండు సాధారణ ఛానళ్లకు బదులు ఒక హెచ్‌డీ ఛానల్‌ను ఎంపిక చేసుకోవచ్చని కొన్ని సంస్థలు ప్రకటిస్తున్నాయి. తమ సర్వీసు ప్రొవైడర్ల నుంచి వినియోగదారులు మరిన్ని తెలుసుకోవాలని ట్రాయ్ సూచించింది. కాగా, ఒక ఛానల్ గరిష్ఠ ధరను రూ.19గా నిర్ణయించింది. ప్రతి ఛానల్ రేటును ట్రాయ్ తన అధికారిక వెబ్‌సైట్ channeltariff.trai.gov.inలో ఉంచింది.
- Advertisement -