మార్చి 1న అల్లు శిరీష్ ‘ఏబిసిడీ’..

167
Allu Sirish

అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఏబీసీడీ. ఇటీవలే విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే హిందీ శాటిలైట్ డిజిటల్ రైట్స్ ఫ్యాన్సీ రేట్‌కు అమ్ముడైన విషయం తెలిసిందే. సీనియర్ నిర్మాత డి.సురేష్ బాబు ఈ చిత్రానికి సమర్ఫకులుగా వ్యవహరిస్తుండడం విశేషం. ప్రతిష్టాత్మక సురేష్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. మెగా బ్రదర్ నాగబాబు ఇందులో అల్లు శిరీష్‌కు తండ్రి పాత్రలో నటించారు. బాలనటుడిగా మనకు సుపరిచితమైన భరత్ ఇందులో హీరో ఫ్రెండ్ పాత్రలో నటిస్తున్నాడు. రుక్సార్ థిల్లాన్ హీరోయిన్.

సంజీవ్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమౌతున్నారు. బిగ్ బెన్ సినిమాస్ యశ్ రంగినేనితో కలిసి మధుర ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లో మధుర శ్రీధర్ ఈ ఎంటర్ టైనర్‌ని నిర్మిస్తున్నారు. కన్నడ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జుధా సాంధీ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ చిత్రాన్ని మార్చి 1వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు.

Allu Sirish

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ… మలయాళంలో సూపర్ సక్సెస్ అందుకున్న ఏబీసీడీ చిత్రాన్ని తెలుగులో అల్లు శిరీష్‌తో నిర్మిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మలయాళంలో దుల్కర్ పోషించిన పాత్రను తెలుగులో శిరీష్ పోషిస్తున్నారు. సురేష్ బాబు ఈ సినిమాకు సమర్పకులుగా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ ద్వారా మార్చి 1న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నాం. మెగా బ్రదర్ నాగబాబు ఇందులో శిరీష్‌కు తండ్రి పాత్రలో నటించారు. మాస్టర్ భరత్ అల్లు శిరీష్ స్నేహితుడిగా నటిస్తున్నాడు.

తెలుగు ప్రేక్షకులంతా హ్యాపీగా ఎంజాయ్ చేసే కథ కావడంతో రీమేక్ చేస్తున్నాం. కృష్ణార్జున యుద్ధం ఫేం రుక్సార్ థిల్లాన్ ను హీరోయిన్గా నటిస్తోంది. కన్నడ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జుధా సాంధీ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండడం విశేషం. దర్శకుడు సంజీవ్ రెడ్డి తెలుగు ప్రేక్షకులు మెచ్చే విధంగా కథను తీర్చిదిద్దారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసే ఈ చిత్రాన్ని మార్చి 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. అని అన్నారు.

నటీనటులు:అల్లు శిరీష్, రుక్సార్ థిల్లాన్, నాగబాబు, భరత్ తదితరులు..సమర్పణ – సురేష్ బాబు, సాంకేతిక వర్గం:మ్యూజిక్ డైరెక్టర్ – జుధా సాంధీ, కో ప్రొడ్యూసర్ – ధీరజ్ మొగిలినేని,బ్యానర్స్ – మధుర ఎంటర్ టైన్ మెంట్, బిగ్ బెన్ సినిమాస్,నిర్మాతలు – మధుర శ్రీధర్, యష్ రంగినేని,దర్శకుడు – సంజీవ్ రెడ్డి.