భారతదేశంలో 5జీ వేలం 26 జూలై 2022న నిర్వహిస్తామని గతంలోనే కేంద్ర టెలికాం మినిస్టర్ అశ్వనీ వైష్ణవ్ ఒక ప్రకటనలో తెలిపారు. 4G కంటే 5G 10 రెట్లు వేగంగా ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. 20 సంవత్సరాల చెల్లుబాటు వ్యవధితో 72GHz స్పెక్ట్రమ్‌లు వేలానికి ఉంచబడ్డాయని ట్రాయ్ తెలిపింది. ఇందు కోసం ట్రాయ్ వివిధ తక్కువ (600MHz, 700MHz, 800MHz, 900MHz, 1800MHz, 2100MHz, 2300MHz), మధ్యస్థం (3300MHz) మరియు అధిక (26GHz) ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లలో స్పెక్ట్రమ్ కోసం వేలం నిర్వహిస్తామని గతంలోనే ప్రభుత్వం వెల్లడించింది.
తాజాగా టెలికాం రెగ్యూలేటరీ అథారటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) దేశంలో కొన్ని ప్రాంతాల్లో 5జీ సేవల సంసిద్దతను పరీక్షంచనున్నారు. భోపాల్ స్మార్ట్ సిటీ, జీఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ న్యూ ఢిల్లీ, దీనదయాల్ పోర్ట్ కాండ్లా మరియు నమ్మ మెట్రో బెంగుళూరులో ఈ 5జీ సేవలను పరీక్షంచనునున్నామని ట్రాయ్ తెలిపింది.
దేశంలో 4జీ సేవలు ఇంకా మారుమూల ప్రాంతాల్లోకి వెళ్లలేదు. తాజాగా గత వారమే జియో సేవల ద్వారా లడఖ్ ప్రాంతంలోని పాంగోంగ్ సరస్సు వద్దకు మొదటిసారిగా 4జీ కనెక్టివిటీ చేరింది. 5జీ స్పెక్ట్రమ్‌లు కొనుగోలు కోసం దేశంలో ప్రముఖ సంస్థలు రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా లాంటివి పాల్గోంటున్నాయి. కాని వేలంలో అదానీ గ్రూప్ సంస్థ కూడా పాల్గోంటున్నట్టు ట్రాయ్ తెలిపింది. ఇది కేవలం అదాని సంస్థల సెక్యూరిటీ కోసమే కాని వినియోగదారుల కోసం కాదని వివరణ ఇచ్చింది అదానీ సంస్థ.