30 సంవత్సరాల జ్ఞాపకాలను గుర్తుచేసిన గ్యాంగ్‌లీడర్ బ్రదర్స్‌!

48
gang leader

టాలీవుడ్‌ ఆల్ టైమ్ హిట్ మూవీల్లో ఒకటి గ్యాంగ్ లీడర్‌. మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రస్ధానంలో టాప్ మూవీల్లో ఒకటిగా గ్యాంగ్ లీడర్‌ నిలవగా విజయ బాపినీడు దర్శకత్వంలో, మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మించిన ఈ సినిమా అప్పట్లో ఓ సెన్సేషన్. చిరుకు మాస్ ఇమేజ్ తీసుకొచ్చిన ఈ సినిమాలో తన మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్, అన్నదమ్ములుగా మురళీమోహన్‌,శరత్ కుమార్‌ల నట,చిరు, విజయశాంతిల కెమిస్ట్రీ పర్‌ఫెక్ట్‌గా వర్కవుట్ అయింది. 1991 మే 9 న విడుదలైన ఈ చిత్రం ఈ ఏడాది మే 9 నాటికి 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది.

ఈ సందర్భంగా గ్యాంగ్‌ లీడర్ బ్రదర్స్‌ 30 సంవత్సరాల తర్వాత అనుకోకుండా కలిసి దిగిన ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. చిరు ఆచార్య సినిమా షూటింగ్‌లో ఉండగా మురళీమోహన్‌,శరత్‌ కుమార్‌లు వేర్వేరు సినిమా షూటింగ్‌లలో రామోజీ ఫిలిం సిటీలో కలుసుకోగా ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది.