హైదరాబాద్ గణేష్ శోభాయాత్రకు సర్వం సిద్ధమైంది. నిమజ్జనం నేపథ్యంలో ఇవాళ ఉదయం 6 గంటల నుండి శుక్రవారం ఉదయం 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. నిమజ్జనం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు.
() బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకూ సాగే ప్రధాన శోభాయాత్రతో పాటు ఊరేగింపు జరిగే ఇతర మార్గాల్లో సాధారణ ప్రజల వాహనాల రాకపోకలకు అనుమతి ఉండదు.
() ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే లారీలు, ఇతర హెవీ వెహికిల్స్‌కు శనివారం రాత్రి వరకూ నగరంలోకి అనుమతి ఉండదు.
() ప్రైవేట్ బస్సులు ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలి.
() శోభాయాత్ర కొనసాగే మార్గాల్లో ఆర్టీసీ బస్సులకు కూడా అనుమతి లేదు. అయితే, గణేష్ నిమజ్జనం కోసం ప్రత్యేకంగా వేసిన బస్సులను హుస్సేన్ సాగర్‌కు కొద్ది దూరంలోనే నిలిపివేస్తారు. అక్కడి నుంచి ప్రజలు నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది.
() పాతబస్తీలో చార్మినార్ మీదుగా శోభాయాత్ర కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కేశవగిరి, మహబూబ్ నగర్ చౌరస్తా, ఇంజిన్ బౌలి, నాగుల్ చింత, హిమ్మత్‌పురా, హరిబౌలి, మొఘల్ పురా, మదీనా చౌరస్తా, ఎంజే బ్రిడ్జి, దారుల్ షిఫా చౌరస్తా, సిటీ కాలేజి వద్ద వాహనాలను దారి మళ్లిస్తారు.
() చంచల్ గూడ జైలు చౌరస్తా, మూసారంబాగ్, చాదర్ ఘాట్ బ్రిడ్జి, సాలార్ జంగ్ బ్రిడ్జి, అఫ్జల్ గంజ్, పుత్లీబౌలి చౌరస్తా, ట్రూప్ బజార్, జామ్ బాగ్ క్రాస్ రోడ్స్, కోఠిలోని ఆంధ్రా బ్యాంకు వద్ద వాహనాల మళ్లింపు ఉంటుంది.
Also Read:పిక్ టాక్ : కుర్ర భామ అందాల గిలిగింతలు
() సెంట్రల్ జోన్‌లో చాపెల్ రోడ్డు ప్రవేశం, జీపీవో వద్ద గద్వాల్ సెంటర్, షాలిమార్ థియేటర్, గన్ ఫౌండ్రి, స్కైలైన్ రోడ్డు ఎంట్రీ, దోమల్ గూడలోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కూడలి, బూర్గుల రామకృష్ణా రావు భవన్, ఇక్బాల్ మినార్, రవీంద్ర భారతి, ద్వారకా హోటల్, ఖైరతాబాద్ చౌరస్తా, చిల్డ్రన్స్ పార్క్, వైస్రాయ్ జంక్షన్, కవాడిగూడ చౌరస్తా, ముషీరాబాద్ చౌరస్తా, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, లోయర్ ట్యాంక్ బండ్ కట్ట మైసమ్మ దేవాలయం, ఇందిరా పార్క్ జంక్షన్ వద్ద వాహనాల మళ్లింపు ఉంటుంది.
()వెస్ట్ జోన్ పరిధిలో టోప్ ఖానా మసీదు, అలస్కా హోటల్ చౌరస్తా, ఉస్మాన్ గంజ్, శంకర్ బాగ్, సీనా హోటల్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ సమీపంలోని అజంతా గేట్, ఆబ్కారీ లేన్, తాజ్ ఐలాండ్, ఏఆర్ పెట్రోల్ పంపు వద్ద వాహనాలు మళ్లింపు ఉంటుంది.
() నార్త్ జోన్ పరిధిలో కర్బలా మైదానం, బుద్ధ భవన్, సెయిలింగ్ క్లబ్, నల్లగుట్ట చౌరస్తా వైపు నుంచి నెక్లెస్ రోడ్డు, అప్పర్ ట్యాంక్ బండ్‌పైకి వాహనాలను అనుమతించరు.
() సికింద్రాబాద్‌లో సీటీవో, వైఎంసీఏ, ప్యారడైజ్ చౌరస్తా, ప్యాట్నీ చౌరస్తా, బాటా, ఘాన్స్ మండీ వద్ద వాహనాల మళ్లింపు ఉంటుంది.