బక్రీద్‌ వేళ జాగ్రత్తలు : సీవీ ఆనంద్‌

31
anand
- Advertisement -

బక్రీద్‌పండుగ నేపథ్యంలో నగరంలో భద్రతా పరమైన చర్యల గురించి నగరంలోని వివిధ మత పెద్దలతో సాలర్‌జంగ్‌ మ్యూజియంలో సమీక్ష సమావేశం నిర్వహించారు సిటీ పోలీసు కమీషనర్‌ సీవీ ఆనంద్‌. ఈ సమీక్ష సమావేశంలో ఉన్నాతాధికారులు,జీహేచ్‌ఎంసీ ఆధికారులు, ముస్లీం మతపెద్దలు తదితరులు పాల్గొన్నారు.

జంతువుల విసర్జీతాలను సక్రమంగా పారిశుద్ద్య కార్మికులు చేరవేయాలన్నారు. జీహెచ్‌ఎంసీ చేపడుతున్న పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించారు. కోవిడ్‌ దృష్ట్యా ప్రజలందరూ భౌతికదూరం పాటించాలని ఆదేశించారు. 300 శానిటేషన్ వాహనాలు, అదనంగా 55 వాహనాలు నేరుగా పీఎస్‌లకు కేటాయిస్తునమన్నారు. చెత్తను సులువుగా పారవేయడానికి మసీదుల వద్ద, పోలీస్ స్టేషన్ల వద్ద చెత్త సంచులను సిద్ధంగా ఉంచడంతోపాటు, సౌత్ జోన్‌లో 2 లక్షల చెత్త సంచులను పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు.


పోలీసు సిబ్బంది, జీహెచ్‌ఎంసీ మరియు పశుసంవర్ధక సిబ్బంది మాత్రమే చెక్‌ పోస్టులను నిర్వహిస్తారని హామీనిచ్చారు. పశువులను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు ఎవరికైనా సమాచారం ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ఇతర విభాగాలతో సమన్వయం కోసం మొత్తం 21 మంది అధికారులను లైజన్ ఆఫీసర్లుగా కేటాయించమన్నారు. బందోబస్త్ ఏర్పాట్లు పార్కింగ్ & భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నిర్వహణను సులభతరం చేయడానికి ఆంక్షలు విధిస్తామని తెలిపారు.

- Advertisement -