పచ్చి అరటికాయతో ప్రయోజనాలు

78
- Advertisement -

అరటిపండు ప్రతిఒక్కరికి ఎంతో ఇష్టమైన ఫలం అని చెప్పవచ్చు. భోజనం చేసిన తరువాత చాలమందికి అరటిపండు తినే అలవాటు ఉంటుంది. ఈ పండు తినడంవల్ల ఎన్నో పోషకాలు మన శరీరానికి మెండుగా అందుతాయి. అందుకే అరటిపండును ఆరోగ్యకరమైన పండుగా పరిగణిస్తుంటారు ఆహార నిపుణులు. అయితే కేవలం అరటిపండుతో మాత్రమే కాకుండా అరటికాయ ద్వారా కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా అరటికాయను బజ్జీలలో వాడుతుంటారు ఇంకా అరటికాయ సలాడ్, కర్రీ, వేపుడు వంటి వాటిలో కూడా దీనిని ఉపయోగిస్తుంటారు..

కానీ పచ్చి అరటికాయను అలాగే తినడానికి చాలమంది ఇష్టపడరు ఎందుకంటే రుచిలో చాలా ఒగరుగా, జిగటుగా అనిపించడం వల్ల పచ్చి అరటికాయను తినడానికి ఇబ్బంది పడుతుంటారు. అయితే పచ్చి అరటికాయను తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయట. అరటిపండుతో పోల్చితే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. తద్వారా శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తో పోరాడే శక్తి లభిస్తుంది. ఇంకా పచ్చి అరటికాయలో విటమిన్ సి, విటమిన్ బి6, విటమిన్ బి12 వంటివి అధికంగా ఉంటాయి.వీటివల్ల బాడీలో ఇమ్యూనిటీ శాతం పెరుగుతుంది. ఇంకా పచ్చి అరటికాయలో ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.

తద్వారా తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఇందులోని ఫైబర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంకా పచ్చి అరటికాయలో మెగ్నీషియం, కాల్షియం వంటి సూక్ష్మ పోషకాల ద్వారా ఎముకలు బలపడతాయి. ఇంకా ఇందులోని పొటాషియం నాడీ వ్యవస్థను క్రమబద్దీకరిస్తుంది. అరటికాయ ప్రతిరోజూ 2.5 గ్రాముల నుంచి 4.5 గ్రాముల వరకు తీసుకుంటే ఎంతో మేలట. ఇందులోని పీచు పదార్థం కడుపు నిండిన భావన కలుగజేసి త్వరగా బరువు తగ్గడానికి సహాయ పడుతుంది. ఇవే కాకుండా అరటికాయలో చక్కెర శాతం కూడా చాలా తక్కువగా ఉండడం వల్ల మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఇది ఎంతగానో ప్రయోజనకరి అని హెల్త్ నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -