రొయ్యలతో ప్రయోజనాలెన్నో?

113
- Advertisement -

నేటి రోజుల్లో శాకాహారులతో పోల్చితే మాంసాహారులే ఎక్కువగా ఉంటారు. చికెన్, మటన్, బిఫ్, ఫిష్.. వంటి వాటితో చేసిన వంటకాలు లేనిదే చాలమందికి ముద్దదిగదు. అయితే మాంసాహారులలో కూడా రెండు రకాల వారు ఉంటారు. కొందరు చికెన్, మటన్ వంటివాటిని తినడానికి అంతగా ఆసక్తి కనబరచారు. అలాంటి వారికి షీ ఫుడ్ బెస్ట్ ఆప్షన్ గా ఉంటుంది. షీ ఫుడ్స్ లో కూడా చాలానే రకాలు ఉన్నాయి, చేపలు, రొయ్యలు, ఫ్రాన్స్ వంటి వాటిని చెప్పుకోవచ్చు..

అయితే చేపల దొరికినంతా ఈజీగా రొయ్యలు లాభించవు. కాబట్టి చాలమందికి రొయ్యల రుచి ఎలా ఉంటుందో కూడా తెలియదు. అయితే వారానికి కనీసం మూడుసార్లు అయిన రొయ్యలు తినాలని ఆహార నిపుణులు చెబుతున్నారు రొయల్లో ఒమేగా 3 పుష్కలంగా ఉంటుంది. అలాగే వీటిలో మినరల్స్, కాల్షియం, అయోడిన్, జింక్ వంటివి కూడా పుష్కలంగా ఉంటాయి. అలాగే మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్, కాపర్ వంటి వాటితో పాటు సెలీనియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇవన్నీ కూడా శరీరంలోని పలు ఆరోగ్య సమస్యలను దూరం చేయడంతో పాటు మంచి పోషకాలు అందిస్తాయి. కాబట్టి రొయ్యలు తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనలు కలుగుతాయో తెలుసుకుందాం.

శృంగార సామర్థ్యాన్ని పెంచడం
మగవాళ్ళలో చాలమందికి శృంగార సమస్యలు వేదిస్తూ ఉంటాయి అలాంటి వారు వారంలో కనీసం మూడు సార్లు రొయ్యలు తింటే శృంగార సామర్థ్యం పెరుగుతుందట. రొయ్యల్లో ఉండే సెలీనియం వీర్యకణాల వృద్దిని పెంచడంతో పాటు.. వాటిని చురుకుగా కదిలేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే క్యాన్సర్ ను దూరం చేయడంలో కూడా సెలీనియం ఎంతో ఉపయోగ పడుతుంది.

మతిమరుపుకు చెక్
చాలమందిని మతిమరుపు సమస్య వేదిస్తూ ఉంటుంది. అలాంటి వారు రొయ్యలు తింటే మంచిది. ఇందులో ఉండే క్యాల్షియం, ఒమేగా 3, మెగ్నీషియం వంటి పోషకాలు జ్ఞాపక శక్తిని పెంచి మతిమరుపును దూరం చేస్తాయి.

Also Read:‘భరతనాట్యం’..విజయం సాధిస్తుంది

ఇంకా వివిధ రకాల చర్మ సమస్యలను దూరం చేయడంలోనూ, చర్మనికి నిగారింపు చేకూర్చడంలోనూ రొయ్యలు చక్కగా ఉపయోగ పడతాయట. కాబట్టి రొయ్యలను వారంలో కనీసం మూడు లేదా నాలుగు సార్లు తింటే ఎంతో మేలని నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -