ఉద్యమకారులకు కాంగ్రెస్ అన్యాయం చేసిందిః మన్నె క్రిశాంక్

356
manne Krishank
- Advertisement -

ఇటివలే వరుస ఎమ్మెల్యేల రాజీనామాలతో డీలా పడిపోయిన కాంగ్రెస్ కు మరో యువ నాయకుడు రాజీనామా చేశాడు. టీపీసీసీ జనరల్ సెక్రటరీ, కాంగ్రెస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ ఆపార్టీకీ రాజీనామా చేశారు. తాను కాంగ్రెస్ పార్టీ లో ఆర్ధికంగా , భవిష్యత్ పరంగా నష్టపోయానన్నారు. ఈసందర్భంగా ఆయన నేడు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకీ రాజీనామా లేఖను పంపించనున్నట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమకారులు, యువతకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందన్నారు. నాకు 2014, 2018లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారు. టికెట్ ఇవ్వకుండా కుటుంబంలో చిచ్చుపెట్టిందన్నారు.

ఇటివలే పెద్దపల్లి ఎంపీ టికెట్ అడిగితే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ నీ దగ్గర అంత డబ్బు లేదు కోట్లు ఖర్చు పెట్టాలి అని చెప్పారన్నారు. కొత్త వారికి కాంగ్రెస్ పార్టీలో అవకాశాలు రావని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో గత ఎన్నికల్లో ఓడిపోయిన వారికి టికెట్ ఇచ్చారని, కర్యకర్తల మనోభావాలు తెలుసుకోకుండా టికెట్ లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో కీలక నిందితుడిగా ఉన్న వ్యక్తికి మల్కాజ్ గిరి పార్లమెంట్ టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కొంత మంది వ్యక్తుల చేతిలో ఉందన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ నాయకులను గుర్తించిదని చెప్పారు. చాలా మంది విద్యార్ది నాయకులకు ఎంపీ, ఎమ్మెల్యే టికెట్ లు ఇచ్చిందని గుర్తు చేశారు. త్వరలోనే తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలిపారు క్రిశాంక్.

- Advertisement -