టీఆర్ఎస్ లోకి సీఎం కేసీఆర్ అన్న కూతురు..

248
K. Ramya Rao
- Advertisement -

ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయ్యే పరిస్ధితులు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు.. ఇటివలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్ కు పార్లమెంట్ ఎన్నికల ముందు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన 19 మంది ఎమ్మెల్యేలు ఒక్కొక్కురుగా కారెక్కుతున్నారు. ఇటివలే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పగా, తాజాగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్లు రాజీనామా చేయగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా గులాబీ కండువా కప్పుకునేందుకు సిద్దమయ్యారని తెలుస్తుంది.

తాజాగా మరో కీలక వ్యక్తి టీఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్దమయ్యినట్టు తెలుస్తుంది. ఆమె ఎవరో కాదు సీఎం కేసీఆర్ అన్న కూతురు కల్వకుంట్ల రమ్యారావు. ఆమె ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా కొనసాగుతుంది. తాజాగా ఆమె కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేశారు. త్వరలోనే సీఎం కేసీఆర్ లేదా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆమె పార్టీలో చేరనున్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్‌లో ఉన్నన్ని రోజులు ఈమె కేసీఆర్ కుటుంబంపై సంచలన ఆరోపణలు విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో ప్రజాకూటమి తరఫున కూకట్ పల్లి టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసిని కోసం ప్రచారం కూడా చేశారు.
ఇలా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండటంతో కాంగ్రెస్ పూర్తిగా ఖాళీ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పుకోవాలి.

- Advertisement -