శ్రీశైలంకు పర్యాటక శోభ..

169
srisailam

కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి చెరువులు మత్తడి దుంకుతున్నాయి దుందుబి నది ప్రవహిస్తుంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరదలతో శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారడంతో ఐదు గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువ నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేయడంతో శ్రీశైలం ప్రాజెక్టుకు పర్యాటక శోభ సంతరించుకుంది.

ప్రాజెక్టు వద్ద పర్యాటకుల జల దృశ్యాలను చూసి సెల్ఫీ దిగుతూ. ఎంజాయ్ చేస్తున్నారు. ఎగువ నుంచి భారీ వరదలతో. త్వరలోనే మరికొన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.