రాజస్థాన్ ఆటగాళ్లకు కరోనా పరీక్షలు!

205
ipl 2020

సెప్టెంబర్ 19 నుండి ఐపీఎల్ 13వ సీజన్ ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యూఏఈకి వెళ్లే ముందు ఆటగాళ్లకు కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ప్రాంఛైజీలు సిద్ధమవుతుండగా తాజాగా రాజస్ధాన్ రాయల్స్ తమ ఆటగాళ్లకు కరోనా పరీక్షలు చేసినట్లు తెలిపింది.

ఇందుకు సంబంధించిన వీడియోని షేర్ చేసిన రాజస్ధాన్ మేనేజ్‌మెంట్… మా ఆటగాళ్లకు కోవిడ్ టెస్ట్‌లు పూర్తయ్యాయి….ఇక ఐపీఎల్ 2020 టోర్నీకి సిద్ధమంటూ ట్వీట్ చేసింది.

ప్రస్తుతం రాయల్స్ ఆటగాళ్లు అందరూ ముంబై లో తమ యాజమాన్యం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరం లో ఉన్నారు. ఐపీఎల్ ప్రారంభానికి రెండు రోజుల ముందు యూఏఈ చేరుకోనున్న ఈ ఆటగాళ్లు బీసీసీఐ నియమాల ప్రకారం 14 రోజులు క్వారంటైన్ లో ఉండాలి… ఆ సమయంలో చేసిన రెండు కరోనా పరీక్షలో నెగెటివ్ వస్తేనే వారు ఐపీఎల్ మ్యాచ్ లో పాల్గొంటారు.