రామలింగారెడ్డి లేనిలోటు పూడ్చలేనిది: మంత్రి హరీశ్‌

249
harishrao
- Advertisement -

దుబ్బాకలో చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు. సోలిపేట రామలింగారెడ్డి లేకుండా కార్యక్రమంలో పాల్గొనడం చాలా బాధగా ఉందని…. ఆయన లేకుండా ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొంటానని నా కలలో కూడా అనుకోలేదన్నారు.

ఆనాడు తెలంగాణ ఉద్యమంలోనూ.. ఈనాడు దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి కోసం చివరి శ్వాస వరకూ రామలింగారెడ్డి పనిచేశారని ఆయనలేని లోటు పూడ్చలేనిదన్నారు. రామలింగారెడ్డి చేతిలో సంతకాలు చేసిన చెక్కులను మీకు అందజేస్తున్నాం…. రామలింగారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నానని చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వం అంటే.. రైతు ప్రభుత్వం.…ప్రజల శ్రేయస్సు ముఖ్యమని, సంక్షేమం ఆగొద్దని తెలంగాణ ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరిస్తుందన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో 693 మందికి రూ.7 కోట్ల రూపాయలు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను అందిస్తున్నాం…. కరోనా వచ్చినా ఈ విపత్కర పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం సంక్షేమం ఆపలేదన్నారు.

కరోనా వచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. పండిన పంటకు మద్దతు ధర ఇచ్చి, చివరి గింజ వరకూ ప్రభుత్వమే కొనుగోళ్లు చేసి వారం రోజుల్లోపే రైతులకు బ్యాంకుల్లో కొనుగోలు డబ్బులను జమ చేసిందన్నారు. రూ.7300 కోట్ల రూపాయలు రైతులకు అందించి…. వచ్చే 10 రోజుల్లో నియోజకవర్గంలో మిగిలిన వారికి కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను అందిస్తాం అన్నారు. కరోనా వచ్చి దేశంతో పాటు, ఇతర రాష్ట్రాలకు చాలా ఇబ్బంది వచ్చిందని.., పేదల సంక్షేమం కోసం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.., ఆసరా ఫించన్లు, రేషన్ బియ్యం, కందిపప్పు తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందన్నారు.

విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని, జిల్లాలో బ్రహ్మండంగా అన్నీ చెరువులు, కుంటలు నిండాయని.. ఇక పంటలు విరివిగా పండనున్నాయి…. కరోనా నేపథ్యంలో దేశంలో ఎవరైనా సంతోషంగా ఉన్నారంటే.. అది కేవలం తెలంగాణ రైతు మాత్రమేనని మంత్రి వెల్లడించారు. కరోనాతో భయపడొద్దు.. అధైర్యపడొద్దని ప్రజలకు మంత్రి సూచించారు. జిల్లాలో ములుగు ఆర్వీఏంలో వంద, సిద్ధిపేట ఏరియా ఆసుపత్రిలో వంద పడకల కరోనా ఆసుపత్రులను ఏర్పాటు చేసుకున్నాం అన్నారు.

మాస్కులు లేకుండా ఎవ్వరూ బయటకు రావొద్దు….. వేడినీరుతో ఆవిరి పట్టండి. వానాకాలం.., పైగా కరోనా సమయంలో ప్రతి రోజూ 4 లీటర్ల గోరువెచ్చని నీళ్లు తాగాలన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత 99 శాతం మంది కోలుకుంటున్నారు. కరోనా వచ్చిందని ఎవ్వరూ అధైర్యపడొద్దని.. అలాగని నిర్లక్ష్యం చేయొద్దన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ అనంత రెడ్డి, పలు మండలాల తహశీల్దార్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -