కోహ్లీసేన అరుదైన రికార్డ్‌

178
Tour whitewash ‘very special,’ says Virat Kohli
Tour whitewash ‘very special,’ says Virat Kohli
- Advertisement -

శ్రీలంక జట్టుపై టీమిండియా జైత్రయాత్రను కొనసాగిస్తూ ఏకైక టీ20ని కూడా భారత్‌ సొంతం చేసుకుంది. మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక్క టీ20 మ్యాచ్ లను గెల్చుకుని టీమిండియా భారత క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు నెలకొల్పింది. గత కెప్టెన్లెవరికీ సాధ్యం కాని రికార్డును కోహ్లీ సేన సొంతం చేసుకుంది. భారత్‌ శ్రీలంక పర్యటనలో ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లోనూ నెగ్గింది. ఇలా ఓ జట్టు మూడు ఫార్మాట్లలో కలిపి 9-0తో ప్రత్యర్థిని ఓడించడం ప్రపంచ క్రికెట్లో ఒక్కసారే జరిగింది. ఆస్ట్రేలియా.. పాకిస్థాన్‌ను అంతే తేడాతో ఓడించింది. ఇప్పుడు భారత్‌ శ్రీలంకను అంతే తేడాతో ఓడించింది.

virat

బుధవారం జరిగిన టీ20లో శ్రీలంక మెరుగైన స్కోరు సాధించినప్పటికీ.. కోహ్లీ సేన ముందు నిలవలేకపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక మునవీర (53; 29 బంతుల్లో 5×4, 4×6), ప్రియాంజన్‌ (40 నాటౌట్‌; 40 బంతుల్లో 1×4, 2×6) సత్తా చాటడంతో లంక 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. 171 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 4 బంతులుండగా ఛేదించింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (82) మరోమారు గెలుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. మనీష్‌ పాండే (51 నాటౌట్‌) కూడా ఛేదనలో కీలక పాత్ర పోషించాడు. భారత బౌలర్లలో కుల్‌దీప్‌ యాదవ్‌ (2/20), చాహల్‌ (3/43) రాణించారు.

కోహ్లి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా ఎంపికయ్యాడు. మ్యాచ్ అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ అన్ని ఫార్మాట్లలోనూ వైట్‌వాష్‌ చేయడం చాలా ప్రత్యేకమని, ఇలా ఇంతకుముందెన్నడూ సాధ్యం కాలేదన్నాడు. తమ జట్టు రిజర్వ్‌ బెంచ్‌ బలమేంటో తెలిసిందని, ఈ ఘనత జట్టు మొత్తానికి చెందుతుందని తెలిపాడు.

భారత జట్టు జోరుకు శ్రీలంక తీవ్రమైన కష్టాల్లో పడిపోయింది. వరల్డ్ కప్ లో పాల్గొనాలంటే ఆ జట్టుకు రెండు విజయాలు అవసరం. వచ్చే ఏడాది ప్రారంభం నాటికి లంకేయులు వెస్టిండీస్ తో ఆడనున్నారు. విండీస్ ది కూడా అదే పరిస్థితి. ఆ జట్టు విఫలమైతే శ్రీలంక, విండీస్ జట్లలో ఒకటే వరల్డ్ కప్ లో పాల్గొంటాయి. ఈ నేపథ్యంలో టీమిండియా అద్భుతమైన విజయం సాధించి, లంక జట్టును పూర్తిగా కష్టాల్లోకి నెట్టింది.

- Advertisement -