స్పైడర్‌ తెలుగు ఆడియో అక్కడే !

198
spyder reales high expectations in tamil
- Advertisement -

మహేష్ అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా ‘స్పైడర్’. ఈ దసరాకి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. మహేష్‌ నటించిన పూర్తి స్థాయి తమిళ చిత్రం ఇదే. తమిళంలో తన డబ్బింగ్‌ తానే చెప్పుకొన్నాడు మహేష్‌. హరీష్ జైరాజ్ ఈ సాంగ్ కి మ్యూజిక్ అదరగొట్టేసినప్పటికీ పాట మాత్రం తమిళ స్టయిల్లో ఉందనే కామెంట్స్ వినబడుతున్నాయి. తమిళ పాట డబ్ చేస్తే తెలుగులో విన్నట్టుంది అంటున్నారు కొందరు.

'NoSmoking' Ads in SPYder

ఇకపోతే తెలుగులో స్పైడర్ ఆడియో వేడుకని రద్దు చేసి స్పైడర్ ‘ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి గట్టిగా ప్లాన్ చేస్తున్న స్పైడర్ టీమ్ తమిళంలో మాత్రం ఆడియో వేడుకని  ఈనెల 9న చెన్నైలో పెద్ద ఎత్తున నిర్వహిస్తుంది. అక్కడే తెలుగు పాటల్నీ ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు శంకర్‌ ముఖ్య అతిథిగా విచ్చేసే అవకాశాలున్నాయని చిత్రబృందం తెలిపింది. తెలుగు చిత్రసీమ నుంచీ కొంతమంది ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకొంటారు. హారిశ్‌ జైరాజ్‌ సంగీతం అందించిన ఈ చిత్రానికి ‘ఠాగూర్‌’ మధు, ఎన్వీ ప్రసాద్‌ నిర్మాతలు. ఈనెల 27 తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ సినిమా విడుదల అవుతోంది.

- Advertisement -