దేశంలో 2069కి చేరిన కరోనా కేసుల సంఖ్య..

228
corona

దేశంలో కోవిడ్-19 సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2వేల మార్క్‌ను దాటింది. గురువారం సాయంత్రం నాటికి దేశంలో 2,069 పాజిటివ్ కేసులు నమోదయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

వీరిలో 156 మంది పేషెంట్లు కోలుకొని డిశ్చార్జి కాగా.. 53 మంది మరణించారు. ప్రస్తుతం మనదేశంలో 1,860 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. దేశవ్యాప్తంగా పరీక్షా కేంద్రాలు పెరగడంతో రేపు, ఎల్లుండి మరిన్ని కేసులు బయటపడే అవకాశముంది.