విద్యుత్ బకాయిలను ఆన్ లైన్‌లో చెల్లించండి..

254
CMD Prabhakar Rao

విద్యుత్ వినియోగదారులు ఆన్ లైన్ ద్వారా పాత బకాయిలు చెల్లించాలని జెన్ కో – ట్రాన్స్ కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు కోరారు. లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో వినియోగదారులు నేరుగా నగదు రూపంలో బిల్లులు చెల్లించడం సాధ్యం కానందు వల్ల ఈ సౌకర్యం వినియోగించుకోవాలని కోరారు. లాక్ డౌన్ ప్రకటించిన సమయంలోని బిల్లులే కాకుండా గతంలో వినియోగించిన విద్యుత్ కు సంబంధించిన బకాయిలు కూడా వినియోగదారులు చెల్లించాల్సివుందని చెప్పారు.

ఆ బకాయిలను ఆన్ లైన్ ద్వారా చెల్లించాలని కోరారు. లాక్ డౌన్ అమలవుతన్నప్పటికీ విద్యుత్ సంస్థలు ఎన్నో వ్యేయ ప్రయాసకు వోర్చి 24 గంటల పాటు నిరంతరాయ, నాణ్యమైన విద్యత్ అందిస్తున్నాయని చెప్పారు. ఈ సదుపాయం నిరాటంకంగా కొనసాగడానికి వినియోగదారులు బిల్లులు చెల్లించి సహకరించాలని ఆయన కోరారు.