హాల్ టికెట్‌ పై టాప్‌ లెస్ ఫోటో..!

117
topless actres photo on admit card

ఇప్పటివరకు మనం ఫోటోలు లేకుండా లేదా వివిధ రకాల వస్తువుల బొమ్మల పేర్లతో విద్యార్థుల హాల్ టికెట్లు చూశాంటాం. ఇంకాస్త ముందుకెళితే సినీ లేదా రాజకీయ,క్రికెటర్స్ ఫోటోలు హాల్ టికెట్లు లేదా ఆధార్ కార్డుల మీద దర్శనమిస్తుండేవి. ఈ హాల్ టికెట్లను నవ్వుకున్న సందర్భాలు కోకోల్లలు. కానీ తాజాగా బీహార్ స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ తెలివి తక్కువ తనంతో నవ్వుల పాలైంది.

ఏకంగా ఓ విద్యార్ధిని హాల్ టికెట్‌పై నటి టాప్‌ లెస్‌ ఫోటో ప్రచురించి విమర్శల పాలవుతోంది. బీహార్‌ ఇంటర్ లెవల్ కంబైన్డ్ కాంపిటిటీవ్ ఎగ్జామ్ వచ్చే నెల 26న జరగనుంది. ఈ నేపథ్యంలో నలందకు చెందిన ఓ విద్యార్థిని హాల్ టికెట్ పై తన ఫోటోకు బదులుగా నటి అర్ధనగ్న ఫోటో ప్రచురితమైంది. హాల్ టికెట్ ను చూసిన విద్యార్థిని విస్తుపోయింది.

అంతేగాదు ఈ హాల్ టికెట్‌ పై అన్ని తప్పులే ఉన్నాయి. ఫస్ట్ ఇంటర్ లెవల్ కంబైన్డ్ కాంపిటీటివ్ ఎగ్జామ్-2014 అని ఉండగా….. విద్యార్థినికి ఆ పరీక్ష ఫిబ్రవరి 26న ఉంది. విద్యార్థిని హాల్ టికెట్ లో నటి టాప్ లెస్ ఫొటో వచ్చిందని తెలుసుకుని ఫొటో తీసి సోషలో మీడియాలో పోస్ట్ చేశారు. హిందీ దినపత్రిక ప్రభాత్ కబర్లో ఈ కథనం రావడంతో విషయం ఇంకా పాపులరైంది. అయితే, ఇప్పటివరకు బీఎస్ఎస్సీ అధికారుల నుంచి ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. హాల్ టికెట్‌ పై ఉన్న నటి అక్కడ పాపులర్ హీరోయిన్‌ అట.

గతంలో బిహార్ టాపర్ల స్కామ్‌ దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఇంటర్ టాపర్లు తాము ఏ సబ్జెక్టులు చదివారో, అందులో ఏయే విషయాలు ఉంటాయో చెప్పలేక తికమకపడి.. చివరికి దొరికిపోయారు.తాజాగా విద్యార్థుల హాల్ టికెట్లలో ఇతరుల ఫొటోలు రావడం, అది కూడా నటి టాప్ లెస్ ఫొటో కావడంతో బిహార్ ఎగ్జామ్ బోర్డులు నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. దీనిపై నెటిజన్లు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది బీఎస్ఎస్సీ పనితీరుకు నిదర్శమని మండిపడుతున్నారు.