ఖైదీ చూసిన పవర్‌స్టార్‌….

224
- Advertisement -

పవర్‌స్టార్ పవన్‌ కళ్యాణ్, ఖైదీ నెంబర్‌ 150 సినిమా చూశాడన్న వార్తలు ఫిల్మ్‌నగర్‌లో గుసగులు వినిపిస్తున్నాయి. నిన్న రాత్రి పవన్‌ ఖైదీ స్పెషల్‌ షో చూశాడని వార్తలు షికార్లు చేస్తున్నాయి. అయితే పవర్‌స్టార్‌ ఈసినిమా చూసారని తెలియడంతో మెగా అభిమానులు పండుగ చేసుకుంటున్నారట. ఈ సినిమా రిలీజ్కు ముందు ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ వేడుకకు పవన్ హాజరు కాకపోవటం పలు అనుమాలకు దారితీసింది. పవన్ పెద్దగా వేడుకలకు రావడానికి ఇష్టపడడని చిరు చెప్పిన అభిమానులు సంతృప్తి చెందలేదు. అయితే ఇప్పుడు ఖైదీ నిర్మాత రామ్ చరణ్ ఏర్పాటు చేసిన స్పెషల్ షోను పవన్ చూశాడని తెలియంటంతో ఫుల్ జోష్లో ఉన్నారు మెగా ఫ్యాన్స్‌.

pawan kalyan to watch khaidi no 150

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమాగా తెరకెక్కిన ఖైదీ నంబర్ 150, ఈ బుధవారం రిలీజ్ అయి ఘనవిజయం సాధించింది. తొలి రోజు కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డ్ సృష్టించిన మెగాస్టార్, పది సంవత్సరాల తర్వాత ఏమాత్రం చెక్కు చెదరకుండా అమ్మడు లెట్స్ డు కుమ్ముడు అంటూ స్టేపులు వేసి తన స్టామినా ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడు. ఇటు ఓవర్‌సిస్‌లోను తొలిరోజు కలెక్షన్‌లోను బహుబాలి రికార్డులను తిరగారాసింది. తొలిరోజు 47.7 కోట్లు వసూలు చేసి, టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ బద్దలు కొట్టింది.

pawan kalyan to watch khaidi no 150

తెలుగు రాష్ట్రాల నుంచి మొద‌టిరోజు 30 కోట్ల 45 వేలు వ‌సూలు చేసింది. క‌ర్నాట‌క -4.70 కోట్లు, ఓవ‌ర్సీస్ (అమెరికా) – 1.22 మిలియ‌న్ డాల‌ర్లు, అమెరికా మిన‌హా మిగ‌తా చోట్ల 3,20,000 డాల‌ర్లు, నార్త్ అమెరికా-8.90 కోట్లు, ఇత‌ర భార‌త‌దేశంలో 2.12 కోట్లు, ఒరిస్సా-12 ల‌క్ష‌లు, త‌మిళ‌నాడు-20లక్ష‌లు వ‌సూలు చేసింది. ఇత‌ర‌చోట్ల ఓ 58ల‌క్ష‌ల వ‌సూళ్లు ద‌క్కాయి“ అని తెలిపారు.

- Advertisement -