‘దేవర’ క్లైమాక్స్ కన్నీళ్ల మయమా?

29
- Advertisement -

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో క్రేజీ సినిమాగా తెరకెక్కుతున్న దేవర మూవీ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్ ఇలా మొత్తం యూనిట్ కష్టపడుతుంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ కి రెడీ అయ్యారు. ఇకపై ఏకధాటిగా షూటింగ్ కంప్లీట్ చేసే యోచనలో టీమ్ ఉంది. అయితే, తాజాగా డైరెక్షర్ కొరటాల శివ తన సన్నిహితుల వద్ద ఈ మూవీపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ విషయాలను రచయిత మచ్చ రవి బయట పెట్టారు. ఇంతకీ, ఏమిటి ఆ విషయాలు అంటే.. దేవరలో యాక్షన్ సీక్వెన్స్ లు మామూలుగా ఉండవు.. సినిమాలోని ప్రతి సీన్ ఇంటర్వెల్ సీన్ అంత హై ఇస్తుందట.

కొరటాల శివ ‘దేవర’ క్లైమాక్స్ చెప్తుంటే చాలా సార్లు కన్నీళ్లు పెట్టుకున్నాం అంటూ దేవర పై మచ్చ రవి చేసిన కామెంట్స్ ఈ చిత్రంపై మరింతగా అంచనాలు పెరిగేలా చేశాయి. ‘దేవ‌ర’ సినిమాలో సీనియ‌ర్ హీరోయిన్ ర‌మ్య‌కృష్ణ ఓ కీల‌క పాత్ర చేస్తుంద‌ని, న‌వంబ‌ర్ 24 నుంచి దేవ‌ర‌కు ర‌మ్య‌కృష్ణ డేట్స్ అడ్జ‌స్ట్ చేసింద‌ని స‌మాచారం. ఇంతకీ, రమ్యకృష్ణ పాత్ర ఏమిటో తెలుసా ?, ఓ వేశ్యగా ఆమె నటిస్తోందట. విలన్ సైఫ్ అలీఖాన్ సరసన రమ్యకృష్ణ పాత్ర సాగుతుందట. ‘దేవర’ సినిమా సముద్రం నేపథ్యంలో జరుగుతుంది.

అన్నట్టు రివెంజ్ డ్రామాగా ఈ సినిమా కథను కొరటాల శివ తన మార్క్ ఉండేలా కథని రాసుకున్నారట. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. దేవర ఫస్ట్ పార్ట్ 1 ఎండింగ్ లో నిజమైన దేవర (ఓల్డ్ ఎన్టీఆర్) ను రివీల్ చేసి.. సీక్వెల్ లో ఆ ఓల్డ్ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సీక్వెల్ ను నడపాలని కొరటాల శివ ప్లాన్ చేస్తున్నాడు. ఇక దేవర రెండో పార్ట్ ను కూడా వచ్చే ఏడాది మార్చి నుంచే షూటింగ్ చేస్తారట.

Also Read:TTD: గరుడ వాహనంపై పద్మావతి అమ్మవారు

- Advertisement -