Califlower:కాలీఫ్లవర్ తో లాభాలు

89
- Advertisement -

చాలమందికి కాలీఫ్లవర్ తినడం ఇష్టం ఉండదు. ఎందుకంటే దీని యొక్క వాసన వల్ల కాలీఫ్లవర్ తినడానికి వెనకడుగు వేస్తారు. కానీ సరైన రీతిలో మసాలాలు దట్టించి కాలీఫ్లవర్ వండితే రుచి ఎంతో కమ్మగా ఉంటుంది. ఇక దీనితో కూర మాత్రమే కాకుండా వేపుళ్ళు కూడా చేసుకోవచ్చు. కాగా కాలీఫ్లవర్ ను కేవలం వంటల కోసం మాత్రమే కాకుండా ఆయుర్వేద ఔషధాలలో కూడా వినియోగిస్తారు. ఈ పువ్వు యొక్క రసంలోనూ, ఆకులలోనూ ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. తాజా పువ్వు రసాన్ని ఒక కప్పు చొప్పున ప్రతిరోజూ సేవిస్తే పొట్టలోని కురుపులు కురుపులు తగ్గిపోతాయి. అంతే కాకుండా దంతాల యొక్క చిగుళ్ళ నుంచి వచ్చే రక్త స్రావాన్ని కూడా నివారిస్తుంది. .

ఇక కాలీఫ్లవర్ యొక్క ఆకుల రసాన్ని రోజు ఒక కప్పు సేవిస్తే రేచీకటి, జుట్టు తెల్లబడడం, చర్మం పొడిబారడం వంటి సమస్యలు దూరం అవుతాయి. ముఖ్యంగా గర్బిణి స్త్రీలు కాలీఫ్లవర్ యొక్క పువ్వు రసాన్ని సేవిస్తే పిండం ఆరోగ్యంగా ఉండడంతో పాటు గర్భధారణ కాకుండా ఉంటుంది. ఇక కాలీఫ్లవర్ ను కూర చేసుకొని తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. శరీరంలోని మంటను తగ్గించడంతో పాటు చెడు కొలెస్ట్రాల్ ను బయటకు పంపిస్తుంది. కాలీఫ్లవర్ లో ఉండే విటమిన్ సి, మాంగనీస్, మెగ్నీషియం మరియు ఇతర యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి కావల్సిన పోషణను అంధించడంతో పాటు క్యాన్సర్ కణాలను నియంతృస్తాయి.

Also read:Owaisi:అమిత్ షాకు నేనంటే భయం

అంతే కాకుండా కాలేయం పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. కాలీఫ్లవర్ ను తినడం వల్ల లంగ్, బ్రెస్ట్, ఒవెరియన్ ఇంకా బ్లేడ్ క్యాన్సర్ వంటి వాటిని తగ్గించవచ్చని పరిశోదనలు కూడా చెబుతున్నాయి. స్త్రీలకు అవసరమైన విటమిన్ బి కాంప్లక్స్.. కాలీఫ్లవర్ లో పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా గర్బిణి స్త్రీలు కాలీఫ్లవర్ కచ్చితంగా తినాలని నిపుణులు చెబుతున్నారు. కాలీఫ్లవర్ లో ఉండే భాస్వరం, మాంగనీస్, జింక్ వంటి పోషకాలు ఎముక పునరుత్పత్తికి తోడ్పడతాయి. కాబట్టి ఎన్నో ఆరోగ్య ప్రయోజనలు ఉన్న కాలీఫ్లవర్ ను కచ్చితంగా తినాలని నిపుణులు చెబుతున్నారు. అయితే కాలీఫ్లవర్ ను అధికంగా తింటే కిడ్నీలో రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంది.అలాగే గ్యాస్ సమస్యలు కూడా ఏర్పడే అవకాశం ఉందట. కాబట్టి కాలీఫ్లవర్ ను మితంగా తింటే ఆరోగ్యమే.. అలాకాకుండా అమితంగా తింటే అనారోగ్యం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -