కొత్త వ్యవసాయ చట్టాల రద్దుపై కమిటీ: సుప్రీం

144
supreme
- Advertisement -

నూతన సాగు చట్టాలు, రైతుల ఆందోళనలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ అంశంలో ఇప్పటికే కేంద్రం వైఖరిని తప్పుబట్టిన సుప్రీం….కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల ర‌ద్దు అంశంపై క‌మిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. తాము ఏర్పాటు చేయబోయే కమిటీకి రైతులు సహకరించాలని తెలిపిన న్యాయస్ధానం..సమస్య పరిష్కారం కావాలి అంటే కమిటీ ముందు అభిప్రాయాలు తెలపాలని కోరింది.

చట్టాన్ని నిలిపివేసే అధికారం మాకు ఉందని వెల్లడించింది సుప్రీం. తాము ఏర్పాటు చేయబోయే కమిటీ క్షేత్రస్థాయిలో పరిస్ధితి తెలుసుకుని నివేదిక అందజేస్తుందని వెల్లడించింది. రామ్ లీల మైదాన్ లేదా ఇతర ప్రదేశాలలో నిరసనల కోసం రైతులు ఢిల్లీ పోలీసు కమిషనర్‌కు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఆర్డర్ లో పేర్కొంటామన్న ధర్మాసనం.

రైతుల నిరసనల్లో ఖలీస్తానీలు చొరబడ్డారని మేము చెప్పామని అటార్నీ జనరల్ కోర్టుకు తెలపగా నిషేధిత సంస్థ ద్వారా నిరసనల్లో చొరబాట్లు ఉంటే దానిని ధృవీకరించాలన్న న్యాయస్థానం ప్రభుత్వానికి సూచించింది. ఇదే అంశంపై రేపు అఫిడవిట్ దాఖలు చేయాలని అటార్నీ జనరల్ కు ప్రధాన న్యాయమూర్తి ఆదేశించింది. ట్రాక్టర్ ర్యాలీ రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా జరుగుతుందని నిన్న నిరసనకారులు తెలిపారని కోర్టుకు తెలిపిన అటార్నీ జనరల్…ర్యాలీని ఆపాలని ఢిల్లీ పోలీసులు దరఖాస్తును దాఖలు చేశారని గుర్తు చేశారు. సొలిసిటర్ దరఖాస్తుపై నోటీసు జారీ చేస్తామని తెలిపింది న్యాయస్థానం.

- Advertisement -