గురుకుల హాస్టల్‌లను సిద్ధం చేయాలి- మంత్రి గంగుల

23
minister gangula

సీఎం కేసీఆర్ ఆదేశాల మెరుకు ఫిబ్రవరి 1వ తేదీ నుండి ప్రారంభం అయ్యే బిసి రెసిడెన్షియల్ విద్యాలయాలు, గురుకుల హాస్టల్‌ల నిర్వహణ పై రాష్ట్ర బిసి, సివిల్ సప్లై శాఖ మంత్రి గంగుల కమలాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సివిల్ సప్లై చైర్మన్ మరెడ్డి శ్రీనివాస్ రెడ్డి,సివిల్ సప్లై ,బిసి సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు హాజరైయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈనెల 20 నుండి 25వ తేదీ వరకు హాస్టల్ లను సిద్దం చేయాలి. హాస్టల్ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలి. దానికి అనుగుణంగా వంట సామగ్రి ,ఇతర ఏర్పట్లు తక్షణమే చేయాలని మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు.