కేంద్రమంత్రికి వృక్షవేదం పుస్తకంను అందజేసిన ఎంపీ సంతోష్..

43
santhosh

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం లో ఉన్న అడవులు పకృతి అందాల చిత్రాలతో కూడిన పుస్తకం ను వేదాలలో పకృతి మరియు వృక్షాల గురించి చెప్పిన విషయాలను తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషల్లో ప్రచురించి తీసుకు వచ్చిన “వృక్ష వేదం” పుస్తకంను కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు అందజేశారు ఎంపీ సంతోష్ కుమార్‌.

కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్‌తో పాటు రాజ్యసభ సభ్యులు డాక్టర్ అనిల్ జైన్ , కుమార్ కేట్కర్ , డాక్టర్ వినయ్ సహస్ర బుద్దే కి అందించారు ఎంపీ సంతోష్. ఈ సందర్భంగా తెలంగాణలో హరితహారం,గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ ప్రాముఖ్యతను వారికి వివరించారు.