బంగాళాఖాతంలో ఈ నెల 6వ తేదీ తర్వాత తుపాను ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది భారత వాతావరణ శాఖ. ఈ నెల 6న ఆవర్తనం… 8వ తేదీ నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది.ఇది క్రమంగా బలపడి తుపానుగా రూపాంతరం చెందుతుందని తెలిపింది.
ఎండలు మండిపోయే నడి వేసవిలోనూ అప్పుడప్పుడు తుపానులు సంభవిస్తుండడం తెలిసిందే. మే 6న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని, ఆ తర్వాత 48 గంటల్లో అల్పపీడనంగా మారుతుందని ఐఎండీ పేర్కొంది. అయితే, ఈ తుపాను పయనం ఎటువైపు, దీని ప్రభావం ఏ రాష్ట్రాలపై ఉంటుందన్నది ఇంకా స్పష్టత రాలేదు.
Also Read:హ్యాపీ బర్త్ డే..త్రిష
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే విస్తారంగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. చేతికొచ్చిన పంట పూర్తిగా నేలపాలైంది. భానుడి భగభగల నుంచి సామాన్యుడికి ఊరట కలుగుతున్నప్పటికీ, రైతులకు మాత్రం తీవ్ర నష్టం వాటిల్లింది. హైదరాబాద్ లో అయితే, రుతుపవనాల సీజన్ తరహాలో కుండపోత వానలు కురుస్తున్నాయి. తడిసిన ధాన్యాన్ని కొనుగోలుచేసేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది.
Also Read:శరత్ బాబు..పుకార్లు నమ్మొద్దు