శరత్ బాబు..పుకార్లు నమ్మొద్దు

46
- Advertisement -

నటుడు శరత్ బాబు మృతి చెందాండంటూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా దీనిని ఖండించారు ఆయన సోదరి. సోషల్ మీడియా లో శరత్ బాబు గురించి వచ్చే వార్తలు అన్ని తప్పుగా వస్తున్నాయి..వాటిని నమ్మొద్దని కోరారు. శరత్ బాబు కొంచెం రికవరీ అయ్యి, రూమ్ షిఫ్ట్ చేయడం జరిగిందని తెలిపారు.

తొందరలోనే శరత్ బాబు గారు పూర్తిగా కోలుకొని మీడియాతో మాట్లాడుతారు అని ఆశిస్తున్నాను అని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు ఏవి నమ్మవద్దు అని విజ్ఞప్తి చేశారు. ఇక మరోవైపు ఆయన ఆరోగ్యం విషమంగానే ఉందని డాక్టర్లు తెలిపారు.

Also Read:హ్యాపీ బర్త్ డే..త్రిష

గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే అనారోగ్య సమస్యలు తీవ్రం కావడంతో ఆరోగ్య పరిస్థితి విషమించగా వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. శరత్ బాబు అసలు పేరు సత్యం బాబు దీక్షితులు. ఇండస్ట్రీలో విలక్షణమైన నటుడిగా గుర్తింపు పొందారు.

Also Read:పవార్ రాజీనామా.. బీజేపీ వ్యూహమేనా ?

- Advertisement -