తెలంగాణలో రేపు వెలువడే ఫలితాల కోసం ప్రతిఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఓటరు ఎవరికి పట్టం కట్టబోతున్నాడనేది రేపటితో తెలియనుంది. ఈసందర్భంగా రేపు ఉదయం 8నుండి కౌటింగ్ ప్రారంభంకానుంది. 119 నియోజకవర్గాల్లో ఆధిక్యత సరళి ఎటువైపుందో మధ్యాహ్నంకల్లా స్పష్టమవుతుంది. శాసనసభ నియోజకవర్గాల్లోని ఓట్లను లెక్కించడానికి ఎన్నికల కమిషన్ రాష్ట్రవ్యాప్తంగా 43 కేంద్రాలను ఏర్పాటుచేసింది.
ఇందులో హైదరాబాద్ జిల్లాలో 13 నెలకొల్పగా, మిగతా 30 జిల్లాల్లో ఒక్కోటి చొప్పున ఉంటాయి. రేపు జరిగే కౌంటింగ్ లో తొలి ఫలితం ఎక్కడి నుంచి రానుందో తెలిసిపోయింది. మొదటి ఫలితం అతి తక్కువ పోలింగ్ కేంద్రాలున్న భద్రచలం నుండి మొదటి ఫలితం వెలువడనుంది.
భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 161 పోలింగ్ కేంద్రాలు మాత్రమే ఉండటంతో ఇక్కడి నుంచి తొలి ఫలితం రానుంది .ఒక్కో రౌండ్ ఓట్ల లెక్కింపు 14 టేబుళ్లపై జరుగునుంది. దీంతో ఉదయం 11.30 గంటలలోపే భద్రాచలం ఫలితం వెలువడవచ్చని తెలుస్తోంది. చివరగా శేరిలింగం పల్లిలో 580 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో అన్నింటికన్న లాస్ట్ కు ఈఫలితం రానుంది.