తండ్రి ద‌ర్వ‌క‌త్వంలో హీరోయిన్ గా కూతురు..

263
priyadashan kalyani
- Advertisement -

మ‌ల‌యాళ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ప్రియ‌ద‌ర్శ‌న్ కూతురు క‌ళ్యాణి ప్రియాద‌ర్శిన్. అక్కినేని అఖిల్ న‌టించిన హ‌లో సినిమా ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైంది. ఆసినిమా ఆశించిన స్ధాయిలో ఆడ‌క‌పోవ‌డంతో ఆమెకు పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు. ప్ర‌స్తుతం సాయి ధ‌ర‌మ్ తేజ్ హీరోగా న‌టిస్తున్న చిత్ర‌ల‌హ‌రి బార్ అండ్ రెస్టారెంట్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా న‌టిస్తుంది. అంతేకాకుండా మ‌ల‌యాళంలో రెండు సినిమాల్లో బిజీగా ఉంది.

helo

ప్రియ‌ద‌ర్శిన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సినిమాలో అర్జున్ కీర్తిసురేష్ లు హీరో హీరోయిన్ లు గా న‌టిస్తున్నారు. ఈమూవీలో ప్ర‌ముఖ న‌టుడు మోహ‌న్ లాల్ ప్ర‌ధాన పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఈసినిమాలో క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శిణి ప్ర‌ముఖ పాత్ర‌లో కినిపించ‌నుంది. తండ్రి ద‌ర్శ‌కత్వంలో ఆమె తొలిసారిగా న‌టిస్తోన్న చిత్రం కావ‌డం విశేషంగా చెప్పుకోవ‌చ్చు. భారీ బ‌డ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈమూవీ షూటింగ్ లో క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శిన్ కూడా జాయిన్ అయ్యింది. 2019స‌మ్మ‌ర్ ఈసినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

- Advertisement -