ఓట్ల లెక్కింపు ప్రారంభం…

190
votes counting
- Advertisement -

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో భాగంగా తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 43 వేల మంది సిబ్బంది ఓట్ల లెక్కింపులో పాల్గొంటున్నారు.

119 నియోజకవర్గాలకు గానూ 1821 మంది అభ్యర్థులు బరిలో దిగిన సంగతి తెలిసిందే. ఈ నెల 7న జరిగిన పోలింగ్‌లో అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఇక లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రతతో పాటు 144 సెక్షన్ విధించారు.

ఎన్నికల ఫలితాల అనంతరం ఈ నెల 12వ తేదీన టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం జరగనుంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు బుధవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తారని సమాచారం. ఈ సమావేశంలో పార్టీ లెజిస్లేచర్ నాయకుడిని ఎన్నుకోనున్నారు.

- Advertisement -