గతంలో ఎన్నడూ లేని విధంగా టమాటో ధరలు భగ్గుమంటున్నాయి. కిలో టమాటోలు రూ. 120 నుండి 150 పలుకుతుండగా మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరో రెండు మూడు నెలలు ఇదే పరిస్థితి ఉండనున్న నేపథ్యంలో దొంగతనాలు మొదలయ్యాయి.
తాజాగా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ లో టమాటో, పచ్చిమిర్చి చోరీ జరిగింది. మూడు రోజులుగా రాత్రి సమయంలో టమాటా బాక్సులు చోరికి గురవుతుండటంతో పోలీసులను ఆశ్రయించారు. ఈ దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. టాటా ఏస్ వాహనంలో నుంచి టమాటో, పచ్చిమిర్చి బాక్సులు గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్తునట్లు సీసీ కెమెరాల్లో గుర్తించిన పోలీసులు దొంగలను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు.
Also Read:యువీ,అగార్కర్‌తో సచిన్ లంచ్..ఎమోషనల్
టమాటో ధరలకు తోడు పచ్చిమిచ్చి ధరలుసైతం భారీగా పెరిగాయి. దీంతో కూరగాయల మార్కెట్లకు వెళ్లేందుకు మధ్య తరగతి ప్రజలు వెనుకాడుతున్న పరిస్థితి నెలకొంది.
Also Read:ఈ లక్షణాలు ఉంటే కిడ్నీలో రాళ్ళు ఉన్నట్లే..!