టాలీవుడ్ అగ్రహీరోలందరి సరసన నటించింది స్టార్ హీరోయిన్ , మిల్కీ బ్యూటీ తమన్నా. ప్రస్తుతం తెలుగు, తమిళ్ సినిమాల్లో బిజీగా ఉంది. హీరోయిన్ గా అవకాశాలు రాకపోవడంతో పలు సినిమాల్లో ఐటెం సాంగ్ లు కూడా చేసింది ఈఅమ్మడు. ఒకప్పుడు టాప్ హీరోయిన్లుగా వెలుగు వెలిగిన వారందరూ అవకాశాలు రాకపోవడంతో పెళ్లీలు చేసుకుని సెటిల్ అయిపోయారు. ఇప్పుడు తమన్నా కూడా అదే బాటలో వెళ్లనుందని తెలుస్తుంది.
అందుకే తమన్నా ఈమధ్య కొత్త సినిమాలకు సైన్ చేయడం లేదని వార్తలు వస్తున్నాయి. తమన్నా పెళ్లి ఫిక్స్ అయిందని..అతను అమెరికాలో డాక్టర్ అని తెలుస్తుంది. అయితే అందరూ అనుకుంటున్నట్టుగా ఇది లవ్ మ్యారెజ్ కాదంటా..పెద్దలు కుదిర్చిన పెళ్లినే చేసుకోబోతుంది మిల్కీ బ్యూటీ.
పెళ్లికొడుకు ఫ్యామిలీ మొత్తం అమెరికాలోనే స్ధిరపడ్డారని..కొద్ది రోజుల క్రీతమే అక్కడ సొంత ఇళ్లును కూడా కొనుక్కున్నారని తెలుస్తుంది. పెళ్లికి రెండు ఫ్యామిలీలు ఒప్పుకోవడంతో మంచి ముహుర్తం కోసం వెయిట్ చేస్తున్నారు. పెళ్లైన తరువాత కూడా తమన్నా అమెరికా వెళ్లిపోతుందని సమాచారం. పెళ్లీ చేసుకోబోతుంది కాబట్టే తమన్నా కొత్త సినిమాలు ఒప్పుకొవడం లేదని ఫిలీం నగర్ టాక్ నడుస్తుంది.