రెమ్యూనరేషన్ తగ్గించుకున్న టాలీవుడ్ యాంకర్లు

228
suma
- Advertisement -

కరోనా వైరస్ విజృంభించడంతో సినిమా షూటింగ్ లు అన్ని వాయిదా వేసిన సంగతి తెలిసిందే. సినిమాతో టీవీ సిరియల్స్, షోలు అన్ని బంద్ చేశారు. తాజాగా ప్రభుత్వం షూటింగ్ లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తిరిగి ప్రారంభించారు. అందులో భాగంగా ప్రముఖ కామెడీ షో జబర్ధస్త్ తిరిగి ప్రారంభమైంది. దీంతో యాంకర్ సుమ క్యాష్ కూడా ప్రారంభమైంది. ఇటివలే ఈరెండు షోలకు సంబంధించిన ప్రోమోలను కూడా విడుదల చేశారు. టాలీవుడ్ లో టాప్ యాంకర్లు అంటే మనకు గుర్తుకు వచ్చేది యాంకర్ సుమ, అనసూయ, రష్మీ. ఈ టాప్ యాంకర్లు తమ రెమ్యూనరేషన్ ను తగ్గించినట్లు తెలుస్తుంది.

ఇన్ని రోజులు కరోనాతో సినిమాలు లేకపోవడంతో నిర్మాతలను దృష్టిలో ఉంచుకుని వీరు ఈ నిర్ణయం తీసుకున్నారట. యాంకర్ సుమ ఒక రోజుకి సుమారు రూ.2లక్షలు తీసుకుంటుండగా ఇప్పుడు రూజ1లక్ష రెమ్యూనరేషన్ ను తీసుకుంటున్నారట. ఇక జబర్ధస్త్ యాంకర్లు అనసూయ, రష్మీలకు ఒక రోజుకి దాదాపు రూ.1లక్ష రూపాయలు ఇవ్వగా ఇప్పడు 70నుంచి 80వేల వరకు తీసుకుంటున్నారు. మళ్లీ షోలకు టీఆర్పీ రేటింగ్ లు పెరిగిన తర్వాత పూర్తి అమౌంట్ ఇస్తామని నిర్మాతలు తెలిపారట. ఈ యాంకర్లు తీసుకున్న నిర్ణయం పట్ల టాలీవుడ్ లో సర్వాత్రా హర్షం వ్యక్తం చేస్త్తున్నారు.

- Advertisement -